విశ్రాంత ఆర్టీవో ఇంటిపై ఏసీబీ దాడి విశాఖ: అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదుల నేపథ్యంలో విశాఖకు చెందిన విశ్రాంత ఆర్టీవో పిల్లి నూకరాజు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ తెల్లవారుజామున దాడులు జరిపారు. అక్కయ్యపాలెం నరసింహానగర్లోని ఆయన నివాసంతోపాటు నగరంలోనే ఉన్న మరో మూడు ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా 31 ఏళ్లపాటు సర్వీసులో కొనసాగిన నూకరాజు ఒంగోలులో పనిచేస్తూ గత ఏడాది ఉద్యోగవిరమణ చేశారు. హైదరాబాద్, నర్సీపట్నం ప్రాంతాల్లోని నూకరాజు ఇళ్లపైన, సన్నిహితుల ఇళ్లపైన కూడా ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వెలుగుచూసిన వివరాల మేరకు నూకరాజు ఆస్తుల విలువ 30 కోట్లు ఉండవచ్చని అధికారుల ప్రాథమిక అంచనా. ఉన్నతాధికారులనుంచీ వచ్చిన ఆదేశాలమేరకు ఈ దాడులు జరిపామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
26/27 july 2011
ReplyDeleteవిశ్రాంత ఆర్టీవో ఇంటిపై ఏసీబీ దాడి
విశాఖ: అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదుల నేపథ్యంలో విశాఖకు చెందిన విశ్రాంత ఆర్టీవో పిల్లి నూకరాజు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ తెల్లవారుజామున దాడులు జరిపారు. అక్కయ్యపాలెం నరసింహానగర్లోని ఆయన నివాసంతోపాటు నగరంలోనే ఉన్న మరో మూడు ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా 31 ఏళ్లపాటు సర్వీసులో కొనసాగిన నూకరాజు ఒంగోలులో పనిచేస్తూ గత ఏడాది ఉద్యోగవిరమణ చేశారు. హైదరాబాద్, నర్సీపట్నం ప్రాంతాల్లోని నూకరాజు ఇళ్లపైన, సన్నిహితుల ఇళ్లపైన కూడా ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వెలుగుచూసిన వివరాల మేరకు నూకరాజు ఆస్తుల విలువ 30 కోట్లు ఉండవచ్చని అధికారుల ప్రాథమిక అంచనా. ఉన్నతాధికారులనుంచీ వచ్చిన ఆదేశాలమేరకు ఈ దాడులు జరిపామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
కెవియస్వి గారికి హృదయపూర్వక ధన్యవాదములు.
ReplyDelete