అదేంటి ఉన్నట్టుండి మాయమైపోయిన ఈ డింగరి మళ్ళీ అసలెందుకు వస్తున్నాడు అని అనుకుంటున్నారా? (కనీసం మీరు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను). ఏమి లేదండి, అవినీతిపరులు ఒక్కరో ఇద్దరో ఐతే నా బ్లాగులో పెడుదాము అన్నది నా ఆలోచన, కాని ఈ అవినీతాగ్రేసరుల కోసం ఒక బ్లాగ్ ఏమి ఖర్మ పూర్తి అంతర్జాలాన్నే అంకితం చేసినా కూడా చోటు సరిపోనంత మంది ఐపోయారు. అదీగాక, గాలి జానర్ధన్ రెడ్డి, జగన్ ల అవినీతితో ఆంధ్ర దేశం మొత్తం అట్టుడికిపోతుంటే చిన్న చేపల గురించి పట్టించుకున్న నాథుడు ఎవరున్నారు చెప్పండి? అందుకే కొంత కాలం దీన్ని ఆపేసి, సి.బి.ఐ వాళ్ళు, వాళ్ళను బోన్లో నిలబెట్టిన తర్వాత మళ్ళీ ప్రారంభించానన్నమాట. అదీ కథా కమీషు.. కాబట్టి మల్లి కాసుకోండీ ఈ అవినీతాగ్రేసరుల వివరాలు :)
Jun 8, 2012
Subscribe to:
Posts (Atom)