నా అభిప్రాయాలు

ఈ పేజీలో వ్రాసినవి, కేవలం నా అభిప్రాయాలు మాత్రమే

ఎంత తిట్టగలిగితే అంత "పేద్ద" రాజకీయ నాయకుడు.

ఈ మధ్య పేపర్ చూస్తూ ఉంటే ఈ రాజకీయ నాయకులు మాట్లాడుకునే (మాట్లాడుకునే అనే కంటే తిట్టుకునే అని అంటే సరిగ్గా ఉంటుందేమో) భాష వింటుంటే చాలా అసహ్యం వేస్తుంది. వీల్లనేనా మనం ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకున్నది అని సిగ్గేస్తుంది. కనీసం పేపరోల్లు కుడా కనీస సెన్సార్ పెట్టకుండా వాల్లు మాట్లడినవి మాట్లడినట్టు వేసేస్తున్నారు. ఉండబట్టలేక నాకు తెలిసిన ఒక విలేకరిని ఈ మద్యన అడిగేసాను. అంటే ఆయన చెప్పిన సమాధనం "అలా రాస్తేనే జనం చదువుతున్నరు మరి" అని. నిజంగా మనం (మనం అని ఎందుకు అన్నాను అంటే, ఆయన చెప్పిన జనం లొ నేను కుడా ఉన్నాను కాబట్టి) అంత దిగజారిపోయామా? నా మాట్టుకు నాకు అలాంటి హెడ్లైన్స్ చూస్తేనే కంపరం వేస్తుంది. మచ్చుకు కొన్ని ఇక్కడ వేస్తున్నాను చూడండి.

10, జనపధ్‌కు కావలి కుక్కగా మారిన కెసిఆర్: రేవంత్ రెడ్డి - ఆంధ్రజ్యోతి

ఇక దెబ్బకు దెబ్బ - కె. సి. ఆర్. - ఈనాడు
నాలుక కోస్తా - అల్లు అరవింద్ - ఈనాడు
ఓళ్లు దగ్గర పెట్టుకోండి - కాపు నాడు హెచ్చరిక - ఆంధ్రజ్యోతి
హరీ - పిచ్చి ప్రేలాపనలు మానుకో - కె.సి.ఆర్ - ఆంధ్రజ్యోతి