May 28, 2013

మరిచిన గతం.

మనం ఎలా తయారయ్యమంటే, ఏదైన సెన్సేషనల్ వార్తలు ఉంటే గాని నిద్దురపట్టకుండా తయారయ్యాము. కాని కొంతకాలం క్రితం జరిగిన సంఘటనల గురించి పూర్తిగా మర్చిపోతాము.

వచ్చే సంవత్సరం మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధించిన ఒకప్పటి సెన్సేషనల్ వార్తలు అన్నీ తిరగతోడుదామని నిర్ణయించుకుని, వాటిగురించి కనుక్కుందామని ఈ పోస్టు ప్రారంభిస్తున్నాను...మచ్చుకు కొన్ని.
  • కె.కె. పదవీచ్యుతుడు కావడానికి కారణం అయిన ఆయన కొడుకు చేసిన హత్యకేసు ఏమైంది?
  • హీరో బాలక్రిష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల కేసు ఏమైంది?
  • ఉవ్వెత్తున ఎగుస్తున్న తెలంగాణ ఉద్యమాన్ని పణంగా పెట్టి కె.సి.ఆర్. ముడుపులు తీసుకున్నాడని వచ్చిన ఆరోపణలు ఏమయ్యాయి? 
మీకు తెలిస్తే కొంచెం చెపుతారా? అలాగే మీకు తెలిసిన ఒకప్పటి సంచలన వార్తలు ఇప్పుడు ప్రజలు  మర్చిపోయిన వాటి గురించి కూడ కాస్తా చెప్పండి. (దయచేసి వ్యక్తుల స్వంత విషయాల జోలికి మాత్రం వెళ్ళవద్దని ప్రార్థన)

No comments:

Post a Comment