నాకు తెలియదు మీలో ఎంతమంది ఈవార్తకు ప్రాముఖ్యత ఇచ్చారో. కాని డిసెంబర్లో ఈ విషయం తెలిసినప్పటినుండీ నేను మాత్రం ఈరోజు కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. తొమ్మిది పదుల వయసులో కూడా వాళ్ళు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్దపడుతున్నారంటే అవినీతిలో మనం ఎంతలా కూరుకొని పోయామో తెల్స్తుంది. వాళ్ళు అవినీతిని అంతమొందిచడం గురించి సత్యాగ్రహం చెయ్యడం నిజంగా ఆనదించదగ్గ విషయమే అయినా, మన స్వాతంత్రం కోసం పోరాడిన వారే భరించ లేక మళ్ళీ రెండో స్వతంత్రపోరాటం లాంటి అవినీతి పై యుద్దానికి దిగుతున్నారంటే మనం ఎంత నీచమైన స్థాయిలో ఉన్నామో తెలుస్తుంది.
దేశంలో ఎన్ని స్కాములు జరిగినా, ఈ రాజకీయ నాయకులకు సిగ్గూ లజ్జా లేకుండా తిరుగుతున్నారు. ఈ ఉద్యోగులు వారి ఇంటి కుక్కళ్ళా వారి చుట్టు తిరుగుతున్నారు. నిజంగా మనమంతా తల్చుకుంటే, ఈ అవినీతి రాజకీయ నాయకుల, ఉద్యోగుల భరతం పట్టలేమా? తప్పకుండా పట్టగలుగుతాము. కనీసం ఈ తొమ్మిది పదుల వయసులో కూడా దేశం కోసం ఆరాటపడుతున్న వారి వేదనను కొంచెం అయినా అర్థం చేసుకుందాం. దయచేసి కొంచెం ఆలోచించండి. ఈ అవినీతిని అంతమొందించడానికి, మీరు మీ జీవితాలను త్యాగం చెయ్యవలిసిన పని లేదు. మీ భార్యా పిల్లలను, కుటుంబాలను వదిలి రావల్సిన పని అంతకన్నా లేదు. మీరు చెయ్యవల్సిందల్లా ఒక్కటే, మీకు అవినీతి గురించిన సమాచారం తెలిస్తే, దయచేసి ఏ.సి.బి. వాళ్ళకు చెప్పండి. మీరు కూడా మీకు సాధ్యం అయినంతవరకు లంచం ఇవ్వకండి. నేను లంచం ఇవ్వను అని ప్రతిజ్ఞ చేసుకోండి. మిమ్మల్ని ఇంకా లంచం గురించి వేదిస్తే, 155361 (ఏ.సి.బి వారి టొల్ ఫ్రీ నంబరు) నంబర్‌కు ఫోన్ చేసి చెప్పండి. మీరు మీ ఐడెంటిటి ఇవ్వవలసిన పని లేదు.
అంతే కాక, మన సమాజంలో పరువు మర్యాద అంటూ చాలా ఫీలు అవుతారు కాబట్టి, ఏ.సి.బి. వారు పట్టుకున్న లంచగొండుల గురించి ఇంకా చాల మందికి చెప్పి, వాళ్ళకు సమాజంలో పరువు లేకుండా చేద్దాం. ఈ డింగరిలో పోస్ట్ చేసిన లంచగొండి మీ ఊరు వాడైతే దయచేసి మీకు తెలిసిన వారందరికీ చెప్పండి. నాకు తెలుసు చాలామంది మీ బ్లాగులు ఫాలో అవుతున్నారని.. వాల్లందరికీ చెప్పండీ. అలాగని మీరు దీన్ని ప్రత్యేకంగా ఢంకా వేసి చెప్పక్కర్లేదు, మీరు మీ స్నేహితులతో మాత్లాడుతున్నప్పుడు ఎప్పుడో ఒకసారి లంచం, అవినీతి గురించిన సంభాషణ తప్పకుండా వస్తుంది.. అప్పుడు చెప్పండి. అందరిలా మనమూ అవినీతిని తిట్టుకుంటూ కూర్చోకుండా, అవినీతిని అంతమొందిచడంలో మనవంతు సహాయం మనమూ చేద్దాం. దయచేసి నా ఈ చిన్న ప్రయత్నానికి మీ సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను.
చివరగా, అవినీతి అంతమొందించడానికి సత్యాగ్రహం చేస్తున్న ఆ గాంధేయవాదులు వీరే.
1. శంభూదత్తా (93)
2. మురళీలాల్ గుప్తా (90)
3. ఆర్.ఎస్. దేవి (84)
4. గోవింద్ నారయన్ సేథ్ (78)
5. అమర్ ఖన్నా (89)
6. కె.పి.సాహు (79)
7. మరో సమాజికవేత్త (పేరు తెలియదు)
మీలో ఎవరికైనా ఈ గాంధేయవాదులు మాట్లాడుతున్న లొక్‌పాల్ బిల్లు గురించి తెలుసుకోవాలనుకుంటే ఈలింక్‌లో చదువవచ్చు.
http://gandhiansatyagrahabrigade.org/appeal/lokpallegislation.html
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment