అవినీతికి సంబందించిన ఎలాంటి సమాచరం మీ దగ్గర ఉన్నా, మీ వివరాలను బయట పెట్టకుండానే ఏ.సి.బి.అధికారులకు సమాచారం ఇవ్వడానికి వీలుగా ఏ.సి.బి అధికారులు టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేస్తున్నారు. మరొక్క వారంలో ఈ ఫోన్ పనిచెయ్యడం ప్రారంభిస్తుంది. ఆ నంబర్ 155361. దయచేసి మీకు తెలిసిన, ఏ.సి.బి. అధికారులకు ఉపయోగపడుతుందనుకున్న, సమాచారాన్ని ఒక భాధ్యత గల పౌరుడిగా వారికి అందించి, అవినీతిని అంతమొందించడానికి మీ వంతు సహాయం చెయ్యండి. ప్లీజ్....
Jun 30, 2010
Jun 28, 2010
మీరైతే ఏంచేస్తారు?
ఈరోజు పొద్దున్నే రేడియోలో వార్తలు వింటూ ఆఫీసుకు వస్తూ ఉంటే అందులో ఒక క్విజ్ విన్నాను, మీకు ప్రపంచాన్ని మార్చడానికి ఒకే ఒక్క అవకాశం వస్తే మీరు ఏమి చేస్తారు అన్నది దాని సారాంశం. అప్పుడు అనిపించింది నాకు అలాంటి అవకాశమే గనక వస్తే.. అవినీతి లేని సమాజం సృష్టిస్తే ఎంత బాగుంటుందీ అని.. మరి మీరు ఏమి చేస్తారు? (నాకు తెలుసు, ఇలాంటి పిచ్చి పిచ్చి టాపికులన్నీ పోస్ట్ చేయకుండా ఉండడానికి కొందరు నా పీక పిసికి చంపేస్తాను అంటారు అని . :), అది కాకుండా ఏమి చేస్తారు అని నా ఉద్దేష్యం.)
Jun 11, 2010
అవినీతి అధికారుల వివరాల కోసం ప్రజల వద్దకు సి.బి.ఐ.
అవినీతి అంతమొందించడానికి మీవంతు సహాయం చేయాడానికి మీకు ఇది ఒక చక్కని అవకాశం. మీకు తెలిసిన అవినీతి అధికారుల గురించి సి.బి.ఐ. అధికారులకు చెప్పండి. ప్రస్తుతానికి ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాత్రమే. వరంగల్ దీనికి తొలి వేదిక అయింది. పిర్యాదులను ఈ శుక్రవారం మధ్యాహ్నం (జూన్ 11, 2010) నుండి శనివారం (జూన్ 12, 2010) మధ్యాహ్నం వరకు వరంగల్ లోని పోలీస్ గెస్ట్ హౌస్ లో స్వీకరిస్తారు
Jun 1, 2010
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు చూసారా?
ఫలితాల సంగతి ఎలా ఉన్నా, పరీక్షా పత్రాలను దిద్దిన అధ్యాపకులను మాత్రం నిజంగా "మెచ్చుకోకుండా" ఉండలేక పోతున్నాను. అసలే అంతంత మాత్రంగా బోధిస్తున్న గురువులు ఇక సమాధాన పత్రాలను కూడా ఇలా దిద్దితే ఇక విద్యార్థుల గతి ఏమి కాను? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అని పూజించే మనము ఇప్పుడు ఇలా దిద్దిన మన అధ్యాపకులను ఎలా పూజించాలి? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వేల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలని చూసిన వీరినుండి నిజంగా మన విద్యార్థులు విద్యాబుద్దులు నేర్చుకుంటారా? మన సమాజానికి చీడపురుగులా దాపురించిన అవినీతితో లంచాలను తీసుకునే లంచావతారుల కంటే ఈ అద్యాపకులు ఏ విధంగా చూసినా కుడా తక్కువ కాదేమో అనిపిస్తుంది. ఇలాంటి వారిని ఏమి చెయ్యాలో మీరే చెప్పండి? అదృష్టవశాత్తు ఏ విద్యార్థి ఎలాంటి అఘాయిత్యము చేసుకోలేదు కాని, ఒకవేల చేసుకుంటే ఈ అద్యాపకులను ఇతరులు క్షమించడం పక్కన పెట్టి కనీసం వాళ్ళను వాళ్ళే క్షమించుకునే స్థానంలో ఉండేవారేనా? ఎంతో భాద్యత గల స్థానంలో ఉండి ఇలా చేసిన అధ్యాపకులారా ఒక్కసారి మీ గుండెలమీద చెయ్యి వేసుకుని చూడండి మీరు ఎంత పెద్ద తప్పు చేసారో తెలుస్తుంది. ఈ కార్పొరేట్ విద్యలతో అంతంత మాత్రమే మిగిలిన గురువుల గౌరవాన్ని దయచేసి మీరు ఇంకా తీసివేయ వద్దు.
Subscribe to:
Posts (Atom)