Jun 1, 2010

ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు చూసారా?

ఫలితాల సంగతి ఎలా ఉన్నా, పరీక్షా పత్రాలను దిద్దిన అధ్యాపకులను మాత్రం నిజంగా "మెచ్చుకోకుండా" ఉండలేక పోతున్నాను. అసలే అంతంత మాత్రంగా బోధిస్తున్న గురువులు ఇక సమాధాన పత్రాలను కూడా ఇలా దిద్దితే ఇక విద్యార్థుల గతి ఏమి కాను? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అని పూజించే మనము ఇప్పుడు ఇలా దిద్దిన మన అధ్యాపకులను ఎలా పూజించాలి? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వేల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలని చూసిన వీరినుండి నిజంగా మన విద్యార్థులు విద్యాబుద్దులు నేర్చుకుంటారా? మన సమాజానికి చీడపురుగులా దాపురించిన అవినీతితో లంచాలను తీసుకునే లంచావతారుల కంటే ఈ అద్యాపకులు ఏ విధంగా చూసినా కుడా తక్కువ కాదేమో అనిపిస్తుంది. ఇలాంటి వారిని ఏమి చెయ్యాలో మీరే చెప్పండి? అదృష్టవశాత్తు ఏ విద్యార్థి ఎలాంటి అఘాయిత్యము చేసుకోలేదు కాని, ఒకవేల చేసుకుంటే ఈ అద్యాపకులను ఇతరులు క్షమించడం పక్కన పెట్టి కనీసం వాళ్ళను వాళ్ళే క్షమించుకునే స్థానంలో ఉండేవారేనా? ఎంతో భాద్యత గల స్థానంలో ఉండి ఇలా చేసిన అధ్యాపకులారా ఒక్కసారి మీ గుండెలమీద చెయ్యి వేసుకుని చూడండి మీరు ఎంత పెద్ద తప్పు చేసారో తెలుస్తుంది. ఈ కార్పొరేట్ విద్యలతో అంతంత మాత్రమే మిగిలిన గురువుల గౌరవాన్ని దయచేసి  మీరు ఇంకా తీసివేయ వద్దు.

No comments:

Post a Comment