(ఇతరవ్యాపకాల వల్ల బిజీగా ఉన్నందున, మే నెలలో పట్టుబడ్డ లంచావతారులు అందరిని ఒకే పేజి లో ప్రచురిస్తున్నాను. త్వరలోనే జూన్ లిస్టు కూడా ప్రచురిస్తాను - డింగరి )
నాకు తెలియదు మీలో ఎంతమంది ఈవార్తకు ప్రాముఖ్యత ఇచ్చారో. కాని డిసెంబర్లో ఈ విషయం తెలిసినప్పటినుండీ నేను మాత్రం ఈరోజు కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. తొమ్మిది పదుల వయసులో కూడా వాళ్ళు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్దపడుతున్నారంటే అవినీతిలో మనం ఎంతలా కూరుకొని పోయామో తెల్స్తుంది. వాళ్ళు అవినీతిని అంతమొందిచడం గురించి సత్యాగ్రహం చెయ్యడం నిజంగా ఆనదించదగ్గ విషయమే అయినా, మన స్వాతంత్రం కోసం పోరాడిన వారే భరించ లేక మళ్ళీ రెండో స్వతంత్రపోరాటం లాంటి అవినీతి పై యుద్దానికి దిగుతున్నారంటే మనం ఎంత నీచమైన స్థాయిలో ఉన్నామో తెలుస్తుంది.
దేశంలో ఎన్ని స్కాములు జరిగినా, ఈ రాజకీయ నాయకులకు సిగ్గూ లజ్జా లేకుండా తిరుగుతున్నారు. ఈ ఉద్యోగులు వారి ఇంటి కుక్కళ్ళా వారి చుట్టు తిరుగుతున్నారు. నిజంగా మనమంతా తల్చుకుంటే, ఈ అవినీతి రాజకీయ నాయకుల, ఉద్యోగుల భరతం పట్టలేమా? తప్పకుండా పట్టగలుగుతాము. కనీసం ఈ తొమ్మిది పదుల వయసులో కూడా దేశం కోసం ఆరాటపడుతున్న వారి వేదనను కొంచెం అయినా అర్థం చేసుకుందాం. దయచేసి కొంచెం ఆలోచించండి. ఈ అవినీతిని అంతమొందించడానికి, మీరు మీ జీవితాలను త్యాగం చెయ్యవలిసిన పని లేదు. మీ భార్యా పిల్లలను, కుటుంబాలను వదిలి రావల్సిన పని అంతకన్నా లేదు. మీరు చెయ్యవల్సిందల్లా ఒక్కటే, మీకు అవినీతి గురించిన సమాచారం తెలిస్తే, దయచేసి ఏ.సి.బి. వాళ్ళకు చెప్పండి. మీరు కూడా మీకు సాధ్యం అయినంతవరకు లంచం ఇవ్వకండి. నేను లంచం ఇవ్వను అని ప్రతిజ్ఞ చేసుకోండి. మిమ్మల్ని ఇంకా లంచం గురించి వేదిస్తే, 155361 (ఏ.సి.బి వారి టొల్ ఫ్రీ నంబరు) నంబర్‌కు ఫోన్ చేసి చెప్పండి. మీరు మీ ఐడెంటిటి ఇవ్వవలసిన పని లేదు.
అంతే కాక, మన సమాజంలో పరువు మర్యాద అంటూ చాలా ఫీలు అవుతారు కాబట్టి, ఏ.సి.బి. వారు పట్టుకున్న లంచగొండుల గురించి ఇంకా చాల మందికి చెప్పి, వాళ్ళకు సమాజంలో పరువు లేకుండా చేద్దాం. ఈ డింగరిలో పోస్ట్ చేసిన లంచగొండి మీ ఊరు వాడైతే దయచేసి మీకు తెలిసిన వారందరికీ చెప్పండి. నాకు తెలుసు చాలామంది మీ బ్లాగులు ఫాలో అవుతున్నారని.. వాల్లందరికీ చెప్పండీ. అలాగని మీరు దీన్ని ప్రత్యేకంగా ఢంకా వేసి చెప్పక్కర్లేదు, మీరు మీ స్నేహితులతో మాత్లాడుతున్నప్పుడు ఎప్పుడో ఒకసారి లంచం, అవినీతి గురించిన సంభాషణ తప్పకుండా వస్తుంది.. అప్పుడు చెప్పండి. అందరిలా మనమూ అవినీతిని తిట్టుకుంటూ కూర్చోకుండా, అవినీతిని అంతమొందిచడంలో మనవంతు సహాయం మనమూ చేద్దాం. దయచేసి నా ఈ చిన్న ప్రయత్నానికి మీ సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను.
చివరగా, అవినీతి అంతమొందించడానికి సత్యాగ్రహం చేస్తున్న ఆ గాంధేయవాదులు వీరే.
1. శంభూదత్తా (93)
2. మురళీలాల్ గుప్తా (90)
3. ఆర్.ఎస్. దేవి (84)
4. గోవింద్ నారయన్ సేథ్ (78)
5. అమర్ ఖన్నా (89)
6. కె.పి.సాహు (79)
7. మరో సమాజికవేత్త (పేరు తెలియదు)
మీలో ఎవరికైనా ఈ గాంధేయవాదులు మాట్లాడుతున్న లొక్‌పాల్ బిల్లు గురించి తెలుసుకోవాలనుకుంటే ఈలింక్‌లో చదువవచ్చు.
http://gandhiansatyagrahabrigade.org/appeal/lokpallegislation.html
ఈ ఇన్స్పెక్టర్ దాచి పెట్టిన లాకర్లను ఒక్కొక్కటి ఇంకా తెరుస్తున్నారు. ఈరోజు తెరిచినా లాకర్లో 23 లక్షల రూపాయలు, ఒక కిలో అరవై గ్రాముల బంగారం మరియు 11 లక్షల విలువైన బాండ్లు స్వాధీనం చేసుకున్నారు.
ఏ.సి.బి వారి లెక్కల ప్రకారం గడిచిన సంవత్సరంలో పట్టుకున్న మొత్తం కేసులలో రెవిన్యూ శాఖ అవినీతిలో అగ్రగామిగా నిలిచినది. గత సంవత్సరం వారు పట్టుకున్న కేసుల వివరాలు క్లుప్తంగా.
శాఖ
కేసులు
రెవిన్యూ డిపార్టుమెంటు
108
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది
42
మున్సిపల్ పరిపాలన, పట్టాణావృద్ది
35
రవాణా, రోడ్లు మరియు భవనాలు
30
హోం
27
సాంఘీక సంక్షేమం
24
విద్యుత్తు
20
ఆరోగ్య కుటుంబ సంక్షేమం
18
విద్య
16
గృహ నిర్మాణం
15
అలాగే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులలో మొత్తం 88.28 కోట్ల రూపాయలు పట్టుకున్నారు. వారికి సంబంధించి ఇంకా కొన్ని వివరాలు
50 లక్షల రూపాయల లోపు ఉన్న కేసులు - పది
50 లక్షల రూపాయల నుండి ఒక కోటి వరకు ఉన్న కేసులు - నలభై
ఒక కోటి నుండి రెండు కోట్ల వరకు ఉన్న కేసులు - ఇరవై ఐదు
నమోదు చేసిన కేసులలో 64.23 శాతం కేసులలో శిక్షలు పడ్డాయి.
44 మంది సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం విధులనుండి తప్పించింది
నమోదు చేసిన కేసులలో 222 గెజిటెడ్ అధికారులు 230 మంది నాన్ గెజిటెడ్ అధికారులు మరియు 53 మంది కార్పోరేషన్ / ప్రైవేట్ అధికార్లు ఉన్నారు.
అలాగే గత సంవత్సరం మొత్తంమీద 178 ట్రాప్ కేసులు, 81 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు మరియు 87 ఆకస్మిక తనిఖీల కేసులు నమోదు చేసారు.
రాష్ట్రానికి చెందిన ఈ క్రింది చెక్ పోస్ట్‌లపై ఎ.సి.బి. అధికారులు దాడులు జరిపారు.
1. నిజమాబాదు జిల్లా సాలూరు.
2. నెల్లూరు జిల్లా భీమునివారిపాలెం
3. అనంతపురం జిల్లా కొడికొండ
4. ఆదిలాబాదు జిల్లా భోరజ్
5. శ్రీకాకుళం జిల్లా పురుషోత్తపురం
అవినీతిలో అభివృధ్ధి?
మనం అభివృధ్ధి చెందుతున్న దేశాల సరసన చేరాము అని గర్వంగా చెప్పుకుంటూనే అవినీతిలో కూడా అదే వేగంతో ముందుకు దూసుకొని పోతున్నాము అని నిరూపించుకుంటున్నాము. Transparency International 178 దేశాల్లో నిర్వహించిన అధ్యయనంలో భారత్ 87వ స్తానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 3 స్తానాలు ఎక్కువ. మనం 87వ స్తానానికి చేరడానికి కామన్ వెల్త్ క్రీడల అవినీతికూడా ఒక కారణమే. డెన్మార్క్ లాగా ప్రథమ స్తానంలొ ఉండకున్నా కనీసం 50 లోపు స్తానంలోకి చేరుకోవాలని కోరుకోవడం అత్యాశ కాదేమో?
- డింగరి
(ఈ list కేవలం అవినీతి నిరోధక శాఖ దాడులు చేసిన వారివి మాత్రమే)
ఈ నెలలో అవినీతి అధికారులనుండి స్వాధీనం చేసుకున్న మొత్తం సొమ్ము:
Date: August 30th, 2010
City/Village: Hyderabad
District: Ranga Reddy
Department: Revenue Department Name: Akbar Ali Khan
Disignation: R.D.O
Amount: 4.0 Crores (Market Value)
*****************************
(వినడానికి వింతగా ఉన్నా, ఇది నిజం. నాకు తెలిసి నేనుకూడ మొదటిసారి చూస్తున్నాను. సి.బి.ఐ వాళ్ళు ఒక ఉపాధ్యాయుడిని పట్టుకోవడం. కాని ఇలాంటి ఉపాధ్యాయులకు కావల్సిందే, ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటూ, తమ పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఆలాంటి వారికి ఇది ఒక గుణపాఠం కావాలి.)
Date: August 28th, 2010
City/Village: Kudakuda
District: Nalgonda
Department: Department of Education Name: Katkuri Ravinder Reddy
Disignation: Secondary Grade Teacher
Amount: 1.0 Crores (Market Value)
*****************************
Date: August 15th, 2010
City: Vishakhapatnam
District: Vishakhapatnam
Department: Health Department Name: Satyanarayana Raju
Disignation: Sanitary inspector
Amount: 1.5 Crores (Market Value)
*****************************
Date: August 3rd, 2010
City: Kakinaada
District: E. Godavari District
Department: Panchayatiraj Deapartment Name: Venkat Reddy
Disignation: Jr. Assistant
Amount: 2 Crores (Market Value)
*****************************
ఈ రోజుల్లొ వార్త పత్రిక చదువుతూ ఉంటే ఎక్కడో ఒక చోట అవినీతి నిరోధక శాఖ ఎవరినో ఒకరిని పట్టుకోవడం, వారు ఎదో ఒక విధంగా బయట పడటం జరుగుతూనే ఉంటుంది. నాకు తెలియదు ఎంతమంది అలాంటి వార్తలు ఎంత మంది దృష్టిని ఆకర్షిస్తాయో తెలియదు కాని కనీసం అన్ని వార్తలు ఒకే దగ్గర చేరిస్తేనన్నా అలాంటి చీడపురుగుల గురించి ఇంకా కొంచెం ఎక్కువ మందికి తెలుస్తుందనే ఉద్దేష్యం తో ఈ చిన్న ప్రయత్నం start చెసాను. అలా పదిమందికి తెలుస్తుంది అని సిగ్గుతో ఏ ఒక్కరు మారిన, లేక మారడానికి ప్రయత్నించినా నా ఈ ప్రయత్నం ఫలించినట్లే.
మీకు తెలిసిన అవినీత్యగ్రేసరులను కూడా ఇక్కడ చేర్చండి. ప్రస్తుతానికి అందరినీ ఒకే దగ్గర చేరుస్తున్నాను ఒకవేళ చాంతాడంత list తయరైతే కనుక అందరినీ జిల్లాల వారిగా విభజిస్తాను.
(ఈ list కేవలం అవినీతి నిరోధక శాఖ దాడులు చేసిన వారివి మాత్రమే)